నీ నామం నా గానం
Ni Namam Na Ganam
25 Jan 2026
నీ నామం నా గానం
నీ స్మరణే నా సర్వం || 2 ||
నా కాపరి నీవే యేసయ్యా
నా ఊపిరి నీవే మెస్సయ్యా || 2 || ||నీ నామం||
నీ వాక్యపు వెలుగులో నడిచెదనయ్యా
నీ రక్షణ గూర్చి నేను పాడెదనయ్యా || 2 ||
సంగీత స్వరములతో స్తుతియి౦తును || 2 ||
స్తుతుల౦దుకో నా యేసురాజా || 2 || ||నీ నామం||
ఈ ఊపిరి నీవిచ్చిన కృపాదానమే
నన్నిలలో కాపాడే కాపరి నీవే || 2 ||
నీ ఆత్మతో నన్ను శృతి చేయుమయా || 2 ||
బ్రతుకంత నీ సేవ చేసెదనయ్యా || 2 || ||నీ నామం||