కన్నులు జారిన కన్నీళ్లు

Kannulu Jarina Kannillu

Bro. Shalem Raju Garu 08 Dec 2025
కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు || 2 || ఉందిలే దీవెన ఎందుకావేదన పొందిన యాతన దేవుడే మరచునా || 2 || పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన || 2 || అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోల్లంతా నీ ముందు తల వంచేను ఇక ముందు || 2 || || ఉందిలే || అనుకొనని శ్రమ లెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన || 2 || అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిను వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసెను కనువిందు || 2 || || ఉందిలే ||