ఇదిగో నేనొక నూతన క్రియను

Idigo Nenoka Nutana Kriyanu

Zion 28 Oct 2025
ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను || 2 || ఈనాడే అది మొలచును దాని నాలోచింపరా || 2 || ||ఇదిగో|| అడవిలో త్రోవనుజేసి – ఎడారిలో నదులను నేను || 2 || ఎల్లప్పుడు సమృద్ధిగా – ప్రవహింప జేసెదను || 2 || ||ఇదిగో|| నాదు ప్రజలు త్రాగుటకు – నేనరణ్యములో నదులు || 2 || సమృద్ధిగా పారునట్లు – సృష్టించెదను నేను || 2 || ||ఇదిగో|| అరణ్యములో జంతువులు – క్రూరపక్షులు సర్పములు || 2 || ఘనపరచును స్తుతియించును – దీని నాలోచించుడి || 2 || ||ఇదిగో|| నూతన సృష్టిగ నినుజేసి – నీ శాంతిని నదివలెజేసి || 2 || ననుజూచి మహిమపరచి – స్తుతిబాడ జేసెదను || 2 || ||ఇదిగో|| నేనే దేవుడనని దెలసి – నా కార్యములను నెరవేర్చి || 2 || ముందున్న వాటికన్న – ఘనకార్యములను జేతున్ || 2 || ||ఇదిగో|| మరుగైన మన్నానిచ్చి – మరితెల్లని రాతినిచ్చి || 2 || చెక్కెదనా రాతిమీద – నొక క్రొత్త నామమును || 2 || ||ఇదిగో|| పరలోక భాగ్యంబులు – నరలోకములో మనకొసగెన్ || 2 || కరుణాసంపన్నుడగు – మన ప్రభువునకు హల్లెలూయ || 2 || ||ఇదిగో||