గతకాలమంత నీ నీడలోన

Gatakalamanta Ni Nidalona

21 Dec 2025
గతకాలమంత నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు – కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం పాడనా నీ కీర్తన – పొగడనా వేనోళ్ళన – || 2 || వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా || 2 || ||గతకాలమంత|| ఎన్నెన్నో అవమానాలెదురైననూ నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయ్యా ఇక్కట్లతో నేను కృంగిననూ నీ చేయి నను తాకి లేపెనయ్యా నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము || 2 || వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా || 2 || ||గతకాలమంత|| మాటలే ముళ్ళుగ మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయా నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తం నను తాకెనయా నీ మాట చక్కటి జీవపు ఊట మరువనెన్నడు నిన్ను స్తుతియించుట || 2 || వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా || 2 || గతకాలమంత నీ నీడలోన – దాచావు దేవా వందనం కృప చూపినావు – కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం పాడనా నీ కీర్తన – పొగడనా వేనోళ్ళన – || 2 || వందనం యేసయ్యా – విభుడవు నీవయ్యా || 2 || ||గతకాలమంత||