నా హృదయాన కొలువైన యేసయ్యా

Na Hrdayana Koluvaina Yesayya

Bro. Yesanna Garu 15 Mar 2026
నా హృదయాన కొలువైన యేసయ్యా నా అణువణువు నిన్నే – ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయార్పణతో – ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా || 2 || ||నా హృదయాన|| అగ్ని ఏడంతలై – మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే – నీ ప్రియుల దేహాలను || 2 || అగ్ని బలము చల్లారెనే – శత్రు సమూహము అల్లాడెనే || 2 || నేను నీ స్వాస్థ్యమే – నీవు నా సొంతమే నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా || 2 || ||నా హృదయాన|| అంతా వ్యర్థమని – వ్యర్థులైరెందరో నా గురి నీపై నిల్పినందుకే – నా పరుగు సార్థకమాయెనే || 2 || నీయందు పడిన ప్రయాసము – శాశ్వత కృపగా నాయందు నిలిచెనే || 2 || నీపై విశ్వాసమే – నన్ను బలపరచెనే నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును || 2 || ||నా హృదయాన|| విత్తినది ఒకరు – నీరు పోసింది వేరొకరు ఎరువు వేసింది ఎవ్వరైననూ – వృద్ధి చేసింది నీవే కదా || 2 || సంఘక్షేమాభివృద్ధికే – పరిచర్య ధర్మము నియమించినావే || 2 || నీ ఉపదేశమే – నన్ను స్థిరపరచెనే నా సర్వము నీకే అర్పింతును || 2 || ||నా హృదయాన||