రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా

Raja Ni Sannidhilone Untanayya

22 Dec 2025
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా || 2 || నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా || 2 || నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా || 2 || ||రాజా|| నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం || 2 || కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును || 2 || నీవే రాకపోతే నేనేమైపోదునో || 2 || ||నేనుండలేనయ్యా|| ఒంటరి పోరు నన్ను విసిగించినా మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా || 2 || ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు || 2 || నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా || 2 || ||నేనుండలేనయ్యా|| ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా || 2 || విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము || 2 || నిన్ను మించిన దేవుడే లేడయ్యా || 2 || ||నేనుండలేనయ్యా||