సుమధుర స్వరముల గానాలతో
Sumadhura Svaramula Ganalato
Hossanna Ministers
22 Dec 2025
సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన || 2 ||
మహదానందమే నాలో పరవశమే
నిన్ను స్తుతించిన ప్రతీక్షణం || 2 || ||సుమధుర||
ఎడారి త్రోవలో నే నడచినా – ఎరుగని మార్గములో నను నడిపినా
నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా || 2 ||
నీవే నీవే నా ఆనందము
(నీవే) నీవే నా ఆధారము || 2 || ||సుమధుర||
సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా || 2 ||
నీవే నీవే నా జయగీతము
(నీవే) నీవే నా స్తుతిగీతము || 2 || ||సుమధుర||
వేలాది నదులన్ని నీ మహిమను – తరంగపు పొంగులు నీ బలమును
పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా || 2 ||
నీవే నీవే నా అతిశయము
(నీకే) నీకే నా ఆరాధన || 2 || ||సుమధుర||