నా యేసు రాజు

Na Yesu Raju

23 Dec 2025
నా యేసు రాజు నాకై పుట్టిన రోజు || 2 || క్రిస్మస్ పండుగా హృదయం నిండుగా || 2 || హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ || 2 || ||నా యేసు|| పరలోకమునే విడిచెను పాపిని నను కరుణించెను పశు పాకలో పుట్టెను పశువుల తొట్టిలో వింతగా || 2 || ||హ్యాపీ|| నమ్మిన వారికి నెమ్మది ఇమ్ముగనిచ్చి బ్రోవఁగా ప్రతి వారిని పిలిచెను రక్షణ భాగ్యమునివ్వగా || 2 || ||హ్యాపీ|| సంబరకరమైన క్రిస్మస్ ఆనందకరమైన క్రిస్మస్ ఆహ్లాదకరమైన క్రిస్మస్ సంతోషకరమైన క్రిస్మస్ || 2 || ||నా యేసు||