సంగీత నాదముతో

Sangita Nadamuto

28 Dec 2025
సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెద నీ గోప్ప కార్యం చాటెద నా జీవితం మార్చిన యేసయ్యా ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా ||సంగీత|| నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెద || 2 || పాపములు క్షమియించి నను మార్చిన దోషములు భరియించి దరిచేర్చిన ||నీ ప్రేమ|| నా కష్ట సమయమున నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెద || 2 || క్షేమమును కలిగించి నను లేపిన దీవెనలు కురిపించి కృపచూపిన ||నీ ప్రేమ|| నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద || 2 || వాక్యముతో దర్శించి బలపరిచిన సత్యముతో సంధించి స్థిరపరిచిన ||నీ ప్రేమ||