వర్ణించలేను వివరించలేను
Varnincalenu Vivarincalenu
27 Dec 2025
వర్ణించలేను వివరించలేను
అతి శ్రేష్టమైన నీ నామమున్
యేసు నీ నామమున్ – || 2 ||
కొనియాడెదన్ కీర్తించెదన్ || 2 ||
అత్యంతమైన నీ ప్రేమను
యేసు నీ ప్రేమను || 2 || ||వర్ణించలేను||
మహోన్నతుడ నీవే – పరిశుద్ధుడ నీవే
పాపినేని చూడక ప్రేమించితివే || 2 ||
హల్లెలూయా హల్లెలూయా || 2 ||
అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా || 2 || ||వర్ణించలేను||
సర్వాధికారి సర్వోన్నతుడా || 2 ||
హీనుడైన నన్ను కరుణించితివే || 2 ||
హల్లెలూయా హల్లెలూయా || 2 ||
అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా || 2 || ||వర్ణించలేను||
రత్న వర్ణుడవు అతి సుందరుడవు || 2 ||
నీ మహిమ నాకిచ్చి వెలిగించితివే || 2 ||
హల్లెలూయా హల్లెలూయా || 2 ||
అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా || 2 || ||వర్ణించలేను||