జుంటె తేనె ధారల కన్నా
Junte Tene Dharala Kanna
Hosanna Ministries
28 Oct 2025
జుంటె తేనె ధారల కన్నా
యేసు నామమే మధురం
యేసయ్య సన్నిధినే మరువజాలను || 2 ||
జీవితకాలమంతా ఆనందించెదా
యేసయ్యనే ఆరాధించెదా || 2 || ||జుంటె తేనె||
యేసయ్య నామమే బహు పూజనీయము
నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి || 2 ||
నన్నెంతగానో దీవించి
జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే || 2 || ||జుంటె తేనె||
యేసయ్య నామమే బలమైన దుర్గము
నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి || 2 ||
నన్నెంతగానో కరుణించి
పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే || 2 || ||జుంటె తేనె||
యేసయ్య నామమే పరిమళ తైలము
నాలో నివసించే సువాసనగా నను మార్చి || 2 ||
నన్నెంతగానో ప్రేమించి
విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే || 2 || ||జుంటె తేనె||