మహిమ ఘనతకు అర్హుడవు

Mahima Ghanataku Arhudavu

28 Dec 2025
మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తి దాత || 2 || మా స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే || 2 || ఆరాధనా నీకే ఆరాధనా నీకే మన్నాను కురిపించినావు బండనుండి నీల్లిచ్చినావు || 2 || యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ||ఆరాధనా|| వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు || 2 || యెహోవా రాఫా స్వస్థపరచును నను స్వస్థపరచును ||ఆరాధనా||