నను విడువక ఎడబాయక

Nanu Viduvaka Edabayaka

Hosanna Ministries 28 Oct 2025
నను విడువక ఎడబాయక దాచితివా.. నీ చేతి నీడలో (యేసయ్యా) నీ చేతి నీడలో || 2 || సిలువలో చాపిన రెక్కల నీడలో || 2 || సురక్షితముగా నన్ను దాచితివా || 2 || కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా || 2 || ||నను|| ఉన్నత పిలుపుతో నన్ను పిలచి || 2 || నీవున్న చోటున నేనుండుటకై || 2 || పిలుపుకు తగిన మార్గము చూపి నను స్థిరపరచిన యేసయ్యా || 2 || ||నను||