హే ప్రభుయేసు హే ప్రభుయేసు
He Prabhuyesu He Prabhuyesu
A B Maasilaamani
17 Nov 2025
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
సిల్వధరా – పాపహరా – శాంతికరా ||హే ప్రభు||
శాంతి సమాధానాధిపతీ
స్వాంతములో ప్రశాంతనిధీ || 2 ||
శాంతి స్వరూపా జీవనదీపా || 2 ||
శాంతి సువార్తనిధీ ||సిల్వధరా||
తపములు తరచిన నిన్నెగదా
జపములు గొలిచిన నిన్నెగదా || 2 ||
విఫలులు చేసిన విజ్ఞాపనలకు || 2 ||
సఫలత నీవెగదా ||సిల్వధరా||
మతములు వెదకిన నిన్నెకదా
వ్రతములుగోరిన నిన్నెగదా || 2 ||
పతితులు దేవుని సుతులని నేర్పిన || 2 ||
హితమతి వీవెగదా ||సిల్వధరా||
పలుకులలో నీ శాంతికధ
తొలకరి వానగా కురిసెగదా || 2 ||
మలమల మాడిన మానవ హృదయము || 2 ||
కలకలలాడె కదా ||సిల్వధరా||
కాననతుల్య సమాజములో
హీనత జెందెను మానవత || 2 ||
మానవ మైత్రిని సిల్వ పతాకము || 2 ||
దానము జేసెగదా ||సిల్వ ధరా||
దేవుని బాసిన లోకములో
చావుయే కాపురముండె గదా || 2 ||
దేవునితో సఖ్యంబును జగతికి || 2 ||
యీవి నిడితివి గదా ||సిల్వ ధరా||
పాపము చేసిన స్త్రీని గని
పాపుల కోపము మండె గదా || 2 ||
దాపున జేరి పాపిని బ్రోచిన || 2 ||
కాపరి వీవెగదా ||సిల్వ ధరా||
ఖాళీ సమాధిలో మరణమును
ఖైదిగ జేసిన నీవే గదా || 2 ||
ఖలమయుడగు సాతానుని గర్వము || 2 ||
ఖండనమాయె గదా ||సిల్వ ధరా||
కలువరిలో నీ శాంతి సుధా
సెలయేరుగ బ్రవహించె గదా || 2 ||
కలుష ఎడారిలో కలువలు పూయుట || 2 ||
సిలువ విజయము గదా ||సిల్వ ధరా||