ఏపాటి దాననయా
Epati Dananaya
17 Nov 2025
ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు || 2 ||
నేనెంతాటి దాననయా నాపై కృప చూపుటకు
నా దోషము భరియించి నా పాపము క్షమీయించి
నను నిల మార్చుటకు కలువరిలో మరణించి || 2 ||
ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేని
కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది || ఏపాటి దానన ||
కష్టల కడలిలో కన్నీటి లోయలలో
నాతోడు నిలిచావు నన్నాదరించావు || 2 ||
అందరు నన్ను విడచిన నను వడువని యేసయ్య
విడువను యెడబాయనని నాతోడై నిలిచితివా
ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి
కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది || ఏపాటి దానన ||
నీ ప్రేమను మారువలెనయా
ని సాక్షిగా బ్రతికేదనేసయ్య
నేనుండిన ని కృపను ప్రకటింతును బ్రతుకంత || 2 ||
నేనోందిన ఈ జయము నీవిచ్చినదేనయ
నీవిచ్చి జీవముకై స్తోత్రము యేసయ్య
ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి
కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది || ఏపాటి దానన ||