లాలి లాలి జోలాలి
Lali Lali Jolali
14 Dec 2025
లాలి లాలి జోలాలి – బాల యేసునకు లాలి
కన్య మరియా తనయునకు – పాడ రండి జోలాలి || 2 ||
లోక రక్షకునకు లాలి – శాంతి కర్తకు జోలాలి || 2 ||
మాదు తండ్రికి మా లాలి || 2 || ||లాలి||
చీకటి దొంతరల తెరలకు – తెరను దింపగా వచ్చినావని
పాప శాపపు తాపములకు – రక్షణను ఇల తెచ్చినావని || 2 ||
మానవుల మోచకుడా లాలి – ధరణిఁ పై దైవమా జోలాలి || 2 ||
మాదు తండ్రికి మా లాలి || 2 || ||లాలి||
దారి తెలియని మానవాళికి – దారి నీవై వెలసినావని
మరణ ఛాయలు రూపుమాపగ – జీవ కిరణమై మెరిసినావని || 2 ||
సత్య రూపునకు లాలి – నీతి సూర్యునకు జోలాలి || 2 ||
మాదు తండ్రికి మా లాలి || 2 || ||లాలి||