ఉత్సాహ గానము చేసెదము
Utsaha Ganamu Cesedamu
Hosanna Ministries
11 Jan 2026
ఉత్సాహ గానము చేసెదము
ఘనపరచెదము మన యేసయ్య నామమును || 2 ||
హల్లెలూయ యెహోవ రాఫా
హల్లెలూయ యెహోవ షమ్మా
హల్లెలూయ యెహోవ ఈరే
హల్లెలూయ యెహోవ షాలోమ్ || 2 ||
అమూల్యములైన వాగ్ధానములు
అత్యధికముగా ఉన్నవి || 2 ||
వాటిని మనము నమ్మినయెడల
దేవుని మహిమను ఆనుభవించెదము || 2 || ||హల్లెలూయ||
ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి
ఇవన్నీ వాగ్ధాన ఫలములే గా || 2 ||
ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది
ఆత్మీయ వరములు అనుభవించెదము || 2 || ||హల్లెలూయ||
వాగ్ధాన దేశము పితరులకిచ్చిన
నమ్మదగిన దేవుడాయన || 2 ||
జయించిన వారమై అర్హత పొంది
నూతన యెరుషలేం ఆనుభవించెదము || 2 || ||హల్లెలూయ||