నీకసాధ్యమైనది ఏదియు లేదు
Nikasadhyamainadi Ediyu Ledu
28 Oct 2025
నీకసాధ్యమైనది ఏదియు లేదు
సమస్తము సాధ్యము నీకు || 2 ||
ప్రభువా ప్రభువా
సమస్తము సాధ్యం || 2 || ||నీకసాధ్యమైనది||
వ్యాధులనుండి స్వస్థపరచుట సాధ్యం – సాధ్యం
బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం – సాధ్యం || 2 ||
నీకు సాటియైన దేవుడు లేనే లేడు యేసయ్యా
నీకు సాటియైన దేవుడు జగమున లేనే లేడయ్యా || 2 ||
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా || 2 || ||నీకసాధ్యమైనది||
పాపమునుండి విడిపించుట సాధ్యం – సాధ్యం
శాపమునుండి విముక్తినిచ్చుట సాధ్యం – సాధ్యం || 2 ||
నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా || 2 ||
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా || 2 || ||నీకసాధ్యమైనది||
దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం – సాధ్యం
నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం – సాధ్యం || 2 ||
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు లేడు యేసయ్యా
నీలా గొప్ప కార్యములు చేసే దేవుడు జగమున లేనే లేడయ్యా || 2 ||
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా || 2 || ||నీకసాధ్యమైనది||
సర్వ సత్యములో నడిపించుట సాధ్యం – సాధ్యం
పరిశుద్ధాత్మను అనుగ్రహించుట సాధ్యం – సాధ్యం || 2 ||
నీలా పరిశుద్ధ దేవుడు లేనే లేడు యేసయ్యా
నీలా పరిశుద్ధ దేవుడు జగమున లేనే లేడయ్యా || 2 ||
బలవంతుడా మహోన్నతుడా
స్తోత్రార్హుడా – నా యేసయ్యా || 2 || ||నీకసాధ్యమైనది||