తంబుర సితార నాదముతో

Tambura Sitara Nadamuto

Joseph Vijay 28 Oct 2025
తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగ రారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాననిన స్వామికే || 2 || ||తంబుర|| పాపులకై దిగి వచ్చెనట – రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని || 2 || విందులు చేసిన యేసునకే – పేదల పాలిట పెన్నిధికే ||తంబుర|| ప్రతి హృదయం ప్రభు మందిరమై – వెలుగులతో విలసిల్లి నీ శోధనలను సమిధలుగా || 2 || నరకాగ్నులలో పడవేసి – క్రీస్తును చేరగ పరుగిడవా ||తంబుర||