కల్వరిలోన చేసిన యాగం
Kalvarilona Cesina Yagam
Sayaram Gattu
28 Oct 2025
కల్వరిలోన చేసిన యాగం
మరణము గెలిచిన నీ యొక్క త్యాగం || 2 ||
కడిగి వేసెను నాదు పాపం
నిలిపె నాలో నీ స్వరూపం || 2 || ||కల్వరిలోన||
ఆ పాపులు అలుపే లేక నిను కొట్టిన దెబ్బలు
తొలగించే నాపై ఉన్న ఆ ఘోర శాపాలు
పరిశుద్ధ దేహముపై చెలరేగెను కొరడాలు
నాలోని రోగాలకై పొందితివా గాయాలు || 2 ||
దైవ సుతుడవే అయిన గాని
కనికరము వీడవు ఏల క్షణమైనా గాని || 2 || ||కల్వరిలోన||
ఏ దోషం లేని దేహం మోసెను సిలువ భారం
రద్దాయెను నాలో నేరం తగ్గించెను నా భారం
నువ్వు పొందిన అవమానం నను ఉన్నతి చేర్చెను
చిందించిన నీదు రక్తం పరిశుద్ధుని చేసెను || 2 ||
నిన్నే బలిగా నువ్వు మార్చుకుంటివి
నన్ను రక్షించుటకు వేదన పడితివి || 2 || ||కల్వరిలోన||
సిలువలో వ్రేలాడుతూ నువ్వు పొందిన దాహము
అందించేను నా కొరకై ఆ జీవ జలము
కఠినులుగా మారి నీకు అందించిన ఆ చేదు
నింపేను నాలో మధురం తొలగించే నా కుటిలం || 2 ||
అధికారమే లేని మరణము నిలిచెను
నిన్ను తాకేందుకు అనుమతి కోరెను || 2 || ||కల్వరిలోన||