లెమ్ము తేజరిల్లుము నీకు

Lemmu Tejarillumu Niku

14 Dec 2025
లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది || 2 || యెహోవా మహిమ నీపై ప్రకాశముగా నుదయించె || 2 || ||లెమ్ము|| యేసే యీ లోకమునకు వెలుగై యున్నానని చెప్పెన్ || 2 || యేసుని నమ్మువారు || 2 || వెలుగులో నడుచువారు || 2 || ||లెమ్ము|| అంధకార మందుండి బంధింప బడిన వారిన్ || 2 || ఆశ్చర్యమైన వెలుగు || 2 || నందించి విమోచించెన్ || 2 || ||లెమ్ము|| దాత ప్రభు యేసుని నమ్మి నీతిగా నడుచువారు || 2 || జాతి భేదములు లేక || 2 || జ్యోతుల వలె నుందురు || 2 || ||లెమ్ము|| మనుజులు మీ సత్క్రియలను జూచి బహు సంతోషించి || 2 || మనసారా పరమ తండ్రిన్ || 2 || మహిమ పరచెదరు || 2 || ||లెమ్ము|| జనములు నీ వెలుగునకు పరుగెత్తి వచ్చెదరు || 2 || రాజులు నీదు ఉదయ || 2 || కాంతికి వచ్చెదరు || 2 || ||లెమ్ము||