నూతన గీతము నే పాడెదా
Nutana Gitamu Ne Padeda
Hossanna Ministers
15 Nov 2025
నూతన గీతము నే పాడెదా – మనోహరుడా యేసయ్యా
నీవు చూపిన ప్రేమను నే మరువను – ఏస్థితిలోనైననూ
సమర్పణతో సేవించెదను నిన్నే – సజీవుడనై ఆరాధించెద నిన్నే
కొలువుచేసి ప్రేమించినావు – కోరదగినది ఏముందినాలో
స్వార్ధ మెరుగని సాత్వీకుడా – నీకు సాటెవ్వరూ
నీవే నా ప్రాణము – నిను వీడి నేనుండలేను || నూతన ||
కడలి తీరం కనబడనివేళ – కడలి కెరటాలు వేధించువేళ
కరుణమూర్తిగా దిగివచ్చినా – నీకు సాటెవ్వరూ
నీవేనా ధైర్యమూ – నీ కృపయే ఆధారమూ || నూతన ||
మేఘములలో నీటిని దాచి – సంద్రములలో మార్గము చూపి
మంటిఘటములో మహిమాత్మ నింపిన – నీకు సాటెవ్వరూ
నీవేనా విజయమూ – నీ మహిమయే నా గమ్యమూ || నూతన ||