నిను పోలిన వారెవరూ
Ninu Polina Varevaru
Benny Joshua
07 Dec 2025
నిను పోలిన వారెవరూ – మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితిన్ నా దేవా || 2 ||
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య || 2 ||
ఎల్ షడ్డాయ్ ఆరాధన – ఎలోహిం ఆరాధన
అడోనాయ్ ఆరాధన – యేషువా ఆరాధన || 2 ||
కృంగియున్న నన్ను చూచి
కన్నీటిని తుడిచితివయ్య
కంటి పాప వలే కాచి
కరుణతో నడిపితివయ్య || 2 || ||ఎల్ షడ్డాయ్||
మరణపు మార్గమందు
నడిచిన వేళయందు
వైద్యునిగా వచ్చి నాకు
మరో జన్మనిచ్చితివయ్య || 2 || ||ఎల్ షడ్డాయ్||