కల్ల ఎరుగని తెల్ల
Kalla Erugani Tella
Bro. Shalem Raju Garu
08 Dec 2025
కల్ల ఎరుగని తెల్ల
పావురమా పైపైకెగిరావా
కఠినమైన ఈ లోకపు
పోకడ కానక ఉన్నావా || 2 ||
అయ్యో… పావురమా…
ఓ ఓ ఓ ఓ… పావురమా… || కల్ల ఎరుగని ||
రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా
రాకాసి మూకల స్నేహాలే నీకు గూడులుగా మారేనా || 2 ||
ఆకలి తీర్చగ చల్లిన నూకలు కావే చెల్లెమ్మా
ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ || 2 ||
గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మా
యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా || 2 || || కల్ల ఎరుగని||
నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా
నీవు లేకపోతే బ్రతుకలేనని రాతాలు చదివవా || 2 ||
ప్రేమంటేనే తెలియని మనుషులు గారడీ చెల్లెమ్మ
ప్రేమ పేరుతో మోసపోతే అది అరాడి బ్రతుకమ్మ || 2 ||
నీతి మాలినమనుషుల ప్రేమనునిజమనుకొక్కమ్మ
ఎండ మావిలో ఎన్నడూ దాహం తీరదు చెల్లెమ్మ || 2 || || కల్ల ఎరుగని||
నీకొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా
నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా || 2 ||
అందరు నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే
కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే || 2 ||
రక్తము పోసి ప్రేమలేఖ నీకు వ్రాసిన నీ ప్రియుడే
రక్షణనిచ్చి రాణిగ చేసే యేసు రాజు ఘనుడే || 2 || || కల్ల ఎరుగని||