ఆధారం నాకు ఆధారం
Adharam Naku Adharam
Bonigala Babu Rao
28 Oct 2025
ఆధారం నాకు ఆధారం
నాకు తోడునీడై ఉన్న నీ కృపయే ఆధారం
ఆశ్రయమూ నాకు ఆశ్రయమూ
ఆపత్కాలమందు ఆశ్రయమూ నీ నామం ఆశ్రయమూ
తల్లితండ్రి లేకున్నా – బంధుజనులు రాకున్నా
లోకమంత ఒకటైనా – బాధలన్ని బంధువులైనా ||ఆధారం||
భక్తిహీన బంధంలో నేనుండగా
శ్రమల సంద్రంలో పడియుండగా || 2 ||
ఇరుకులో విశాలతనూ కలిగించిన దేవా || 2 ||
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా || 2 || ||ఆధారం||
దారిద్య్రపు సుడినుండి ఐశ్యర్యపు తీరానికి
నీ స్వరమె నా వరమై నడిపించిన యేసయ్యా || 2 ||
విడువను ఎడబాయనని పలికిన నా దేవా || 2 ||
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా || 2 || ||ఆధారం||
దిగులుపడిన వేళలలో దరిచేరిన దేవా
అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా || 2 ||
చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా || 2 ||
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా || 2 || ||ఆధారం||