ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
Ascaryakarudu Alocanakarta
Sirivella Hanok
28 Oct 2025
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి సమాధానకర్త || 2 ||
తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో
తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో || 2 || ||ఆశ్చర్యకరుడు||
తన చేతిలో రోగాలు లయమైపోయెను
తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను || 2 ||
తన మాటతో ప్రకృతినే శాసించినవాడు || 2 ||
నీటిపై ఠీవిగా నడచినవాడతడు || 2 || ||ఆశ్చర్యకరుడు||
మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు
మనకోసం సజీవుడై లేచినవాడతడు || 2 ||
తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు || 2 ||
తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు || 2 || ||ఆశ్చర్యకరుడు||