ఆశ్చర్యాకరుడా
Ascaryakaruda
Hosanna Ministries
28 Oct 2025
ఆశ్చర్యాకరుడా
నా ఆలోచన కర్తవు || 2 ||
నిత్యుడగు తండ్రివి
నా షాలేము రాజువు || 2 ||
సింహపు పిల్లలైనా
కొదువ కలిగి ఆకలిగొనినా || 2 ||
నీ పిల్లలు – ఆకలితో అలమటింతురా
నీవున్నంతవరకు || 2 || ||ఆశ్చర్యాకరుడా||
విత్తని పక్షులను
నిత్యము పోషించుచున్నావు || 2 ||
నీ పిల్లలు – వాటికంటే శ్రేష్టులే కదా
నీవున్నంతవరకు || 2 || ||ఆశ్చర్యాకరుడా||
చీకటి తొలగే
నీతి సూర్యుడు నాలో ఉదయించె || 2 ||
నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను
నీవున్నంతవరకు || 2 || ||ఆశ్చర్యాకరుడా||