ప్రభు మొర వినవా
Prabhu Mora Vinava
Jakkaiah
29 Oct 2025
ప్రభు మొర వినవా
ప్రభు మొర వినవా
నీ కొరకే నేను వెదకేను దేవా
నాకొకసారి కనిపించ రావా – || 2 || ||ప్రభు||
నాదు ప్రాణము తల్లడిల్లాగా
భూదిగంతముల నుండియేగా || 2 ||
మొఱ్ఱ పెట్టుచుంటి నీకేగా || 2 || ||నీ కొరకే||
ఎక్కలేని ఎత్తైన కొండ
ఎక్కించుము నను పరిశుద్ధ కొండ || 2 ||
చక్కని ప్రభు నీ మోము జూడ || 2 || ||నీ కొరకే||
మిత్రుడా నా ఆశ్రయ నీవే
శత్రువుల యెడ నా కోట నీవే || 2 ||
స్తుతికి కారణభూతుడా నీవే || 2 || ||నీ కొరకే||