మారుతుంది నీ జీవితము
Marutundi Ni Jivitamu
Bro. Shalem Raju Garu
08 Dec 2025
మారుతుంది నీ జీవితము వేదన చెందకుమా
మరచిపోడు నిను యేసయ్య మాటే నమ్ము సుమా || 2 ||
మోసే భారం నువు చేసే త్యాగం || 2 ||
ఎదురీతలన్ని యెద కోతలన్ని
చూసేను నా దైవం చేయ్యునులే సాయం || 2 ||
ఆలస్యం అయిందని ఆక్రందన చెందకు
రోజులు మారవని రోధించకు || 2 ||
ఆ రోధననే ఆరాధనగా మనుగడనే మాధుర్యముగా
మలచును నా దైవం విడువకు నీ ధైర్యం || 2 || || మారుతుంది ||
నీ కథ మారిందని నిరాశలో ఉండకు
నీ వ్యధ తీరదని చింతించకు || 2 ||
నీ చింతలనే చిరు నవ్వులుగా యాతననే స్తుతి కీర్తనగా
మార్చును నా దైవం వీడకు విశ్వాసం || 2 || || మారుతుంది ||