తేనెకన్న తీయనైనది

Tenekanna Tiyanainadi

28 Oct 2025
తేనెకన్న తీయనైనది నా యేసు ప్రేమ – మల్లెకన్న తెల్లనైనది || 2 || నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాలమందు నాకు తోడైయుండెను || 2 || ||తేనెకన్న|| ఆగకనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో || 2 || అడ్డంకులన్ని నన్ను చుట్టినా నా దేవుని నే విడువకుందును || 2 || ||తేనెకన్న|| నా వాళ్ళే నన్ను విడిచినా నా బంధువులే దూరమైనా || 2 || ఏ తోడు లేక ఒంటరినైననూ నా తోడు క్రీస్తని ఆనందింతును || 2 || ||తేనెకన్న||