యేసయ్యా నీ నామ గానం
Yesayya Ni Nama Ganam
16 Nov 2025
యేసయ్యా నీ నామ గానం - నే పాడెద జీవితాంతం
శోధన వేదన భాదలు కలిగిన - నే పాడెద శాంతి గీతం
హల్లెలూయా - ఆమెన్ - హల్లెలూయా || 4||
జీవాధిపతియైన దేవా - నిత్య జీవం నా కొసగినావా || 2 ||
జీవజలమై, జీవాహరముగా - పరమునే విడచినావా || 2 || ||హల్లె||
నీ మాటే నా నోట పాడగా - ప్రభు నీ మాటే నా బ్రతుకు బాటగా || 2 ||
ప్రకటింతునయ్యా, నీ సిలువ వార్త - ప్రాణమున్నంత వరకు || 2 || ||హల్లె||