ఎంతో వింత యెంతో చింత
Ento Vinta Yento Cinta
28 Oct 2025
ఎంతో వింత యెంతో చింత
యేసునాధు మరణ మంత || 2 ||
పంతము తో జేసి రంత
సొంత ప్రజలు స్వామి నంత || 2 || ||ఎంతో||
పట్టి కట్టి నెట్టి కొట్టి
తిట్టి రేసు నాధు నకటా || 2 ||
అట్టి శ్రమల నొంది పలుక
డాయె యేసు స్వామి నాడు || 2 || ||ఎంతో||
మొయ్యలేని మ్రాను నొకటి
మోపి రేసు వీపు పైని || 2 ||
మొయ్యలేక మ్రాని తోడ
మూర్చబోయే నేసు తండ్రి || 2 || ||ఎంతో||
కొయ్యపై నేసయ్యన్ బెట్టి
కాలు సేతులలో జీలల్ || 2 ||
కఠిను లంత గూడి కొట్టిరి
ఘోరముగ క్రీస్తేసున్ బట్టి || 2 || ||ఎంతో||
దాహము గొన చేదు చిరక
ద్రావ నిడిరి ద్రోహు లకటా || 2 ||
ధాత్రి ప్రజల బాధ కోర్చి
ధన్యుడా దివి కేగె నహహా || 2 || ||ఎంతో||
బల్లెముతో బ్రక్కన్ బొడవన్
పారే నీరు రక్త మహహా || 2 ||
ఏరై పారే యేసు రక్త
మెల్ల ప్రజల కెలమి నొసగు || 2 || ||ఎంతో||