నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
Ninne Ninne Ne Kolutunayya
K Rajababu
08 Dec 2025
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా || 2 ||
యేసయ్య యేసయ్య యేసయ్యా…
కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో || 2 ||
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా || 2 || || యేసయ్యా ||
ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా || 2 ||
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా || 2 || || యేసయ్యా ||
మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప || 2 ||
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా || 2 || || యేసయ్యా ||
వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటాన || 2 ||
కలలా కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా || 2 || || యేసయ్యా ||