ఎవరూ లేక ఒంటరినై
Evaru Leka Ontarinai
28 Oct 2025
ఎవరూ లేక ఒంటరినై
అందరికి నే దూరమై || 2 ||
అనాథగా నిలిచాను
నువ్వు రావాలేసయ్యా (4)
స్నేహితులని నమ్మాను మోసం చేసారు
బంధువులని నమ్మాను ద్రోహం చేసారు || 2 ||
దీనుడనై అంధుడనై
అనాథగా నే నిలిచాను || 2 ||
నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||
నేనున్నాను నేనున్నానని అందరు అంటారు
కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు || 2 ||
దీనుడనై అంధుడనై
అనాథగా నే నిలిచాను || 2 ||
నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||
చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి
శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి || 2 ||
దీనుడనై అంధుడనై
అనాథగా నే నిలిచాను || 2 ||
నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||