బంగారం అడుగలేదు
Bangaram Adugaledu
06 Dec 2025
బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా
ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా || 2 ||
మనుషులను చేసాడయ్యా
ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా || 2 ||
నా యేసయ్యా.. నా యేసయ్యా…
నా యేసయ్యా.. నా యేసయ్యా… ||బంగారం||
పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ
భూలోకం వచ్చాడయ్యా
మానవుని రక్షించి పరలోకమున చేర్చ
సిలువను మోసాడయ్యా || 2 ||
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా || 2 || ||నా యేసయ్యా||
రక్షణను అందించి రక్తాన్ని చిందించి
మోక్షాన్ని ఇచ్చాడయ్యా
ధనవంతులనుగా మనలను చేయ
దారిద్ర్యమొందాడయ్యా || 2 ||
కన్నీటిని తుడిచాడయ్యా
సంతోషం పంచాడయ్యా || 2 || ||నా యేసయ్యా||