తేజోవాసుల స్వాస్థ్యమందు
Tejovasula Svasthyamandu
18 Nov 2025
తేజోవాసుల స్వాస్థ్యమందు – నను చేర్చుటే
నీ నిత్యసంకల్పమా నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా -2
తేజోవాసుల స్వాస్థ్యమందు
అగ్నిలో పుటము వేయబడగా – నాదు విశ్వాసము -2
శుద్ధ సువర్ణమగునా – నీదు రూపు రూపించబడునా -2 || తేజో ||
రాబోవు యుగములన్నిటిలో – కృపా మహదైశ్వర్యం -2
కనుపరచే నిమిత్తమేనా – నన్ను నీవు ఏర్పరచితివా -2 || తేజో ||
శాపము రోగములు లేని – శాశ్వత రాజ్యము -2
శాపవిముక్తి పొందిన – శాంతమూర్తుల స్వాస్థ్యమదేనా -2 ||తేజో ||
నటనలు నరహత్యలు లేని – నూతన యెరూషలేం -2
అర్హతలేని నన్నును – చెర్చుటయే నీ చిత్తమా -2 ||తేజో||