దేవునియందు నిరీక్షణ నుంచి
Devuniyandu Niriksana Nunci
19 Nov 2025
దేవునియందు నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా || 2 ||
ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు || 2 ||
ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు || 2 || ||దేవుని||
చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు || 2 ||
సత్యమగు – జీవమగు – మార్గమేసే || 2 || ||దేవుని||
నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే || 2 ||
ఆధారము – ఆదరణ – ఆయనలో || 2 || ||దేవుని||
తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను || 2 ||
తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు || 2 || ||దేవుని||
నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు || 2 ||
శత్రువులు – మిత్రులుగా – మారుదురు || 2 || ||దేవుని||
పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు || 2 ||
కనికర – సంపన్నుడు – నా దేవుడు || 2 || ||దేవుని||
స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద || 2 ||
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ || 2 || ||దేవుని||