నా విమోచకుడా యేసయ్యా
Na Vimocakuda Yesayya
Bro. Yesanna Garu
16 Nov 2025
నా విమోచకుడా యేసయ్యా
నీ జీవన రాగాలలో
నీ నామమే ప్రతిధ్వనించెనే
నీతిమంతునిగా నన్ను తీర్చి
నీదు ఆత్మతో నను నింపినందునా
నీవు చూపిన నీ కృప నేమరువలేను || నా విమోచకుడా ||
జీవ వాక్యము నాలోన నిలిపి
జీవమార్గమలో నడిపించి నందునా
జీవాధిపతి నిన్ను నేవిడువలేను || నా విమోచకుడా ||
మమతలూరించె వారెవరు లేరని
నిరాశల చెరనుండి విడిపించినందునా
నిన్ను స్తుతించకుండా నేనుండలేను || నా విమోచకుడా ||