ఆరాధించెదను నిన్ను

Aradhincedanu Ninnu

Kripal Mohan 28 Oct 2025
ఆరాధించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో || 2 || ఆనంద గానముతో ఆర్భాట నాదముతో || 2 || ||ఆరాధించెదను|| నీ జీవ వాక్యము నాలో జీవము కలిగించె || 2 || జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను || 2 || ||ఆరాధించెదను|| చింతలన్ని కలిగిననూ నిందలన్ని నన్ను చుట్టినా || 2 || సంతోషముగ నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును || 2 || ||ఆరాధించెదను||