చిరకాల స్నేహితుడా
Chirakaala snehithuda
Sharon Philip
28 Oct 2025
చిరకాల స్నేహితుడా
నా హృదయాన సన్నిహితుడా || 2 ||
నా తోడు నీవయ్యా – నీ స్నేహం చాలయ్యా
నా నీడ నీవయ్యా – ప్రియ ప్రభువా యేసయ్యా
చిరకాల స్నేహం – ఇది నా యేసు స్నేహం || 2 ||
బంధువులు వెలివేసినా
వెలివేయని స్నేహం
లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం
నా యేసు నీ స్నేహం || 2 || ||చిరకాల స్నేహం||
కష్టాలలో కన్నీళ్లలో
నను మోయు నీ స్నేహం
నను ధైర్యపరచి ఆదరణ కలిగించు
నా యేసు నీ స్నేహం || 2 || ||చిరకాల స్నేహం||
నిజమైనది విడువనిది
ప్రేమించు నీ స్నేహం
కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం
నా యేసు నీ స్నేహం || 2 || ||చిరకాల స్నేహం||