కృపా సత్య సంపూర్ణుడా

Krupa Satya Sampurnuda

Bro. Yesanna Garu 18 Nov 2025
కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా ||2|| నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా ... మహనీయుడవు నీవేనయా ... ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహు క్షేమముగా ||2|| ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే ||2|| ||కృపా|| నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయ్యగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా ||2|| నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే ||2|| ||కృపా|| నైవేద్యములు, దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలిఅర్పణ కాగా ||2|| నా జిహ్వబలులు, స్తోత్ర బలులుగ మారిపోయెనే ||2|| ||కృపా||