ఎడబాయని నీదు కృప
Edabayani Nidu Krupaa
Deevenaiah
28 Oct 2025
ఎడబాయని నీదు కృప – విడనాడని నీ ప్రేమ || 2 ||
నన్నెంతగానో బలపరచెను
నన్నెంతగానో స్థిరపరచెను || 2 ||
నన్ను బలపరచెను – నన్ను వెంబడించెను
నన్నెంతగానో స్థిరపరచెను || 2 || ||ఎడబాయని||
కన్నీటి లోయలలో నుండి
నన్ను దాటించిన దేవా
సింహాల బోనులలో నుండి
నన్ను విడిపించిన ప్రభువా || 2 || ||నన్ను బలపరచెను||
నేనున్నతమైన స్థితిలో
ఉండాలని ఆశించితివా
ఏ అర్హత నాకు లేకున్నా
నా కృప నీకు చాలునంటివే || 2 || ||నన్ను బలపరచెను||
నేనెదుర్కొనలేని పరిస్థితులు
నా ఎదుట ఉన్నవి దేవా
నీ శక్తిని నేను కోరెదను
నన్ను విడిపించు నా దేవా || 2 || ||నన్ను బలపరచెను||