నీతో గడిపే ప్రతి క్షణము

Nito Gadipe Prati Ksanamu

Jyothi Raju 23 Nov 2025
నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా || 2 || కృప తలంచగా మేళ్లు యోచించగా || 2 || నా గళమాగదు స్తుతించక – నిను కీర్తించక యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4) ||నీతో|| మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు || 2 || నా ప్రేమ చేత కాదు నీవే నను ప్రేమించి || 2 || రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు || 2 || ||యేసయ్యా|| గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు || 2 || నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే || 2 || వాగ్ధానము నెరవేర్చి వారసుని చేసావు || 2 || ||యేసయ్యా||