రాజా జగమెరిగిన నా యేసు రాజా
Raja Jagamerigina Na Yesu Raja
Bro. Yesanna Garu
16 Nov 2025
రాజా జగమెరిగిన నా యేసు రాజా
రాగాలలో అను రాగాలు కురిపించిన
మన బంధము అనుబంధము || 2 ||
విడదీయగలరా ఎవరైననూ ఏదైననూ || 2 || || రాజా ||
దీన స్థితియందున సంపన్న స్థితియందున
నడచినను ఎగిరినను సంతృప్తి కలిగియిందును || 2 ||
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా || 2 || || రాజా ||
బలహీనతలయందున అవమానములయందున
పడినను కృంగినను నీ కృపకలిగియుందునే || 2 ||
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా || 2 || || రాజా ||
సీయోను షాలేము మన నిత్య నివాసము
చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి యుందునే || 2 ||
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా || 2 ||. || రాజా ||