నీవు లేకుండా నేనుండలేను
Nivu Lekunda Nenundalenu
16 Nov 2025
నీవు లేకుండా నేనుండలేను
నాకున్నవన్నీ నీవే యేసయ్య || 2 ||
నా ప్రాణమా నా ధ్యానమా
నా ఊపిరి నీవే యేసయ్య || 2 ||
జాలిలేనిది ఈ మాయలోకము
కలతచెందెను నా దీన హృదయము || 2 ||
నను కాపాడుటకు నా దరి నిలచితివా
హస్తము చాపితివా నను బలపరచితివా || 2 ||
నను ప్రేమించేవారు ఎందరు ఉన్నను
అంతము వరుకు నాతో ఉండరు || 2 ||
నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా
నా ప్రాణము నీవే యేసయ్య || 2 ||
కన్నులు మూసిన కన్నులు తెరచిన
నా చూపులలో నీ రూపమే || 2 ||
కనికరించితివా కరుణామయుడా
కృప చూపించితివా నాకు చాలిన దేవుడా || 2 ||