ఎంతో సుందరుడమ్మ తాను
Ento Sundarudamma Tanu
M Prashanth Raju
28 Oct 2025
ఎంతో సుందరుడమ్మ తాను…
ఎంతో సుందరుడమ్మ తాను
నేనెంతో మురిసిపోయినాను || 2 || ||ఎంతో||
ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు || 2 ||
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు || 2 ||
ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు – || 2 ||
ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు || 2 ||
అవలీలగా నతని గురితింపగలనమ్మా || 2 || ||ఎంతో||
కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు || 2 ||
మరులు మనసున నింపు మహనీయుడాతండు || 2 ||
కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు
మరులు మనసున నింపు మహనీయుడాతండు – || 2 ||
సిరులు కురిపించేను వర దేవ తనయుండు || 2 ||
విరబూయు పరలోక షారోను విరజాజి || 2 || ||ఎంతో||
పాలతో కడిగిన నయనాలు గలవాడు || 2 ||
విలువగు రతనాల వలె పొదిగిన కనులు || 2 ||
పాలతో కడిగిన నయనాలు గలవాడు
విలువగు రతనాల వలె పొదిగిన కనులు – || 2 ||
కలుషము కడిగిన కమలాల కనుదోయి || 2 ||
విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు || 2 || ||ఎంతో||
మేలిమి బంగారు స్థలమందు నిలిపిన || 2 ||
చలువ రాతిని బోలు బలమైన పాదాలు || 2 ||
మేలిమి బంగారు స్థలమందు నిలిచినా
చలువ రాతిని బోలు బలమైన పాదాలు – || 2 ||
ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. || 2 ||
బలవంతుడగువాడు బహుప్రియుడాతండు || 2 || ||ఎంతో||
అతడతికాంక్షానీయుండు తనయుండు || 2 ||
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు || 2 ||
అతడతికాంక్షానీయుండు తనయుండు
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు – || 2 ||
ఆతని నొరతి మధురంబు మధురంబు || 2 ||
ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస || 2 || ||ఎంతో||