అపరాధిని యేసయ్యా
Aparadhini Yesayya
Siripurapu Krupaanandamu
01 Jan 2026
అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా || 2 ||
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు || 2 || || అపరాధిని ||
సిలువకు నిను నే గొట్టి
తులువలతో జేరితిని || 2 ||
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా || 2 || || అపరాధిని ||
ప్రక్కలో బల్లెపుపోటు
గ్రక్కున పొడిచితి నేనే || 2 ||
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితి వయ్యో || 2 || || అపరాధిని ||
ముళ్ళతో కిరీటంబు
నల్లి నీ శిరమున నిడితి || 2 ||
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి || 2 || || అపరాధిని ||
దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావ నిడితి || 2 ||
ద్రోహుండనై జేసితినీ
దేహంబు గాయంబులను || 2 || || అపరాధిని ||
ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని || 2 ||
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా || 2 || || అపరాధిని ||
చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత || 2 ||
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా || 2 || || అపరాధిని ||
శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ దెచ్చితివయ్యా || 2 ||
అక్షయ భాగ్యము నియ్య
మోక్షంబు జూపితివయ్యా || 2 || || అపరాధిని ||