గూడు లేని గువ్వలా దారి తప్పితి

Gudu Leni Guvvala Dari Tappiti

Guntur Raja 28 Oct 2025
గూడు లేని గువ్వలా దారి తప్పితి గుండె చెదరిన కోయిలనై మూగబోయితి || 2 || నీ గుండెలో దాచుమా నీ గూటికే చేర్చుమా || 2 || నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా ||గూడు|| గువ్వలకు గూళ్ళిష్టం – కోయిలకు పాటిష్ఠం నాకేమో నువ్విష్టం – నీ సన్నిధి ఇష్టం || 2 || నువ్వంటే ఇష్టం యేసయ్యా నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా || 2 || ||నా ప్రాణమా|| చేపలకు నీళ్ళిష్టం – పిల్లలకు తల్లిష్టం నీకేమో చెలిమిష్టం – నా స్నేహం ఎంతో ఇష్టం || 2 || నేనంటే నీకెంతో ఇష్టమయ్యా నీవెంటుంటే ఇంకా ఇష్టమయ్యా || 2 || ||నా ప్రాణమా||