ఎన్నో ఎన్నో మేలులు

Enno Enno Melulu

Shubhakar Rao 06 Jan 2026
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా || 2 || హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ || 2 || ||ఎన్నో|| బాధలలో మంచి బంధువువైనావు వ్యాధులలో పరమ వైద్యుడవైనావు || 2 || చీకటి బ్రతుకులో దీపము నీవై పాపములన్నియు కడిగిన దేవా || 2 || నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా || 2 || ||ఎన్నో|| శోధనలో సొంత రక్షకుడైనావు శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు || 2 || హృదయ వేదన తొలగించినావు కృపా క్షేమముతో నడిపించినావు || 2 || నా కోసం భువికొచ్చిన దైవ మానవా నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా || 2 || ||ఎన్నో||