నిన్ను తలచి నను నేను మరచి

Ninnu Talaci Nanu Nenu Maraci

28 Oct 2025
నిన్ను తలచి నను నేను మరచి నీ సాక్షిగా ఇల నే బ్రతుకుచుంటిని || 2 || యేసయ్యా.. నీ కృప లేక నే బ్రతుకలేను || 2 || ||నిను తలచి|| జీవము లేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతిని || 2 || జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా || 2 || ||నిను తలచి|| దారే తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని || 2 || నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా || 2 || ||నిను తలచి|| సద్గుణ శీలుడా సుగుణాలు చూచి హృదిలో నేను మురిసిపోతిని || 2 || సుగుణాలు చూచుటకే నీవు సిలువలో నాకై నలిగిన యేసయ్యా || 2 || ||నిను తలచి||